ప్రతిభకు ‘ఆపిల్’ పట్టం.. తిరుపతి వాసికి రూ.1.67 కోట్ల వేతనంతో ఉద్యోగం
- కంపెనీలో శాస్త్రవేత్తగా ఆంధ్రుడికి అవకాశం
- బెంగళూరులో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసిన రవితేజ
- న్యూయార్క్ ఎన్వైయూ వర్సిటీలో ఎంఎస్ పూర్తి
ఇంటర్ వరకు తిరుపతిలో చదివిన రవితేజ బెంగళూరులో బీటెక్, న్యూయార్క్ ఎన్వైయూ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రతిభకు శ్రమను జోడిస్తే ఉన్నత స్థానం దానంతట అదే దక్కుతుందని నిరూపించిన రవితేజ ఈ తరం యువతకు ఆదర్శనీయుడు. రవితేజ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివేందుకు వందశాతం ఉపకార వేతనంపై సీటు సాధించడం మరో విశేషం.