సిద్ధమైన హరికృష్ణ విగ్రహం.. అందుకోనున్న జూ.ఎన్టీఆర్!
- పశ్చిమ గోదావరి శిల్పుల తయారీ
- రేపు హరికృష్ణ జయంతి
- అందుకోనున్న హీరో జూ.ఎన్టీఆర్
పశ్చిమ గోదావరికి చెందిన శిల్పులు డా.పెనుంగొండ అరుణ్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్ లు హరికృష్ణపై అభిమానంతో ఆయన విగ్రహాన్ని తయారుచేశారు. హరికృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు జూ.ఎన్టీఆర్ కు అందజేస్తామని తెలిపారు. తాము కేవలం అభిమానంతోనే ఈ విగ్రహాన్ని తయారుచేసినట్లు అరుణ్, కరుణాకర్ స్పష్టం చేశారు.