'ఎన్టీఆర్' బయోపిక్.. చంద్రబాబు భార్య పాత్రలో మంజిమ?
- ధ్రువీకరించని చిత్ర యూనిట్
- శరవేగంగా సాగుతున్న రెండో షెడ్యూల్ షూటింగ్
- సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు
అయితే తాజాగా ఈ విషయమై ఓ ఆసక్తికరమైన వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ మలయాళ నటి మంజిమా మోహన్ ను భువనేశ్వరి పాత్రకు క్రిష్ ఎంపిక చేశాడని సమాచారం. మంజిమ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించింది. ఈ సినిమాలో చంద్రబాబు దంపతులతో పాటు ఏఎన్నార్, శ్రీదేవి, సావిత్రి, ఎస్వీఆర్ తదితర పాత్రలు కూడా కనిపించనున్నాయి. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.