కేరళ వరద బాధితులకు రూ.5 లక్షల విరాళం ప్రకటించిన టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ
- కేరళ తనకు ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రదేశమన్న విజయ్
- ఆదుకునేందుకు ముందుకు రావాలని అభిమానులకు పిలుపు
- సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్
తనకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాల్లో కేరళ ఒకటని ఈ సందర్భంగా విజయ్ ట్వీట్ చేశాడు. కేరళ వాసులు ఎంతో మంచివారని పేర్కొన్నాడు. మరోవైపు, తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమల హాసన్, కార్తీ, సూర్య తదితరులు ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించారు.