మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రమ్యకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రమ్యకృష్ణ

  • రమ్యకృష్ణ రేంజ్ ను పెంచేసిన 'శివగామి'
  • 'శైలజా రెడ్డి అల్లుడు'లో మరో పవర్ఫుల్ రోల్ 
  • వరుణ్ తేజ్ మూవీలోను అదే తరహా పాత్ర
'బాహుబలి'లో 'శివగామి' పాత్ర రమ్యకృష్ణకి తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆమెకి పవర్ఫుల్ రోల్స్ రావడం మొదలెట్టాయి. త్వరలోనే ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో రమ్యకృష్ణ మరింత బిజీ కావడం ఖాయమనే టాక్ బయటికి రావడంతో, కొంతమంది దర్శక నిర్మాతలు ముందుగా ఆమె డేట్స్ తీసేసుకుంటున్నారట.

హీరోయిన్స్ ఎంపిక కంటే ముందుగానే రమ్యకృష్ణ డేట్స్ ను తీసుకుంటున్నారని సమాచారం. అలా ఇప్పటికే నాలుగైదు సినిమాలను అంగీకరించిన రమ్యకృష్ణ, తాజాగా మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సాగర్ చంద్ర .. వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలోను రమ్యకృష్ణ రేంజ్ కి తగినట్టుగానే ఆమె పాత్ర వుంటుందట. అందువల్లనే ఆమె అంగీకరించిందని చెబుతున్నారు.  
varun tej
ramyakrishna

More Telugu News