ఎంసెట్ స్కామ్ తమకు తెలియదంటున్న శ్రీ చైతన్య యాజమాన్యం... కోర్టులో తేల్చుకోవాలన్న సీఐడీ!
- 2016లో ఎంసెట్ స్కామ్
- పట్టుబడిన 104 మంది విద్యార్థుల్లో 80 మంది శ్రీచైతన్య వాళ్లే
- చార్జ్ షీట్ లో శ్రీ చైతన్య యాజమాన్యం పేర్లు
స్కామ్ లో భాగంగా చేతులు మారిన డబ్బులో ఇప్పటివరకూ రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నామని సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంలో తమ ప్రమేయం ఏమీ లేదని, అది కొన్ని కాలేజీలను పర్యవేక్షిస్తున్న వ్యక్తి చేసిన నేరమేనని, తమ కాలేజీల్లో అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని శ్రీ చైతన్య యాజమాన్యం చెబుతోంది. ప్రమేయం ఉందో లేదో కోర్టు విచారణలో తేలుతుందని, కాలేజీల యాజమాన్యం విచారణను ఎదుర్కోవాల్సిందేనని సీఐడీ అధికారులు తేల్చిచెబుతున్నారు.