ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి.. ఎప్పటికీ మమ్మల్నే కోరుకునేలా పరిపాలన అందిస్తాం: పవన్‌
Add ap7am to your home Screen

ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి.. ఎప్పటికీ మమ్మల్నే కోరుకునేలా పరిపాలన అందిస్తాం: పవన్‌

  • విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో బహిరంగ సభ  
  • మేము సరికొత్త మార్పును తీసుకొస్తాం
  • యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి ఉంది
  • ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సి ఉంది
జనసేనకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండని, ఎప్పటికీ తమనే కోరుకునేలా పరిపాలన అందిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. తాము సరికొత్త మార్పును తీసుకొస్తామని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి ఉందని, ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సి ఉందని అన్నారు. ప్రజల సమస్యలను తొలగించడానికే జనసేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు.

ఈరోజు విజయనగరం జిల్లా ఎస్‌.కోటలోని దేవిగుడి జంక్షన్‌లో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్రాని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రభుత్వం అనుగుణంగా లేదని అన్నారు. కాగా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
Pawan Kalyan
Jangaon District
Vijayanagaram District

More Telugu News