మంత్రి మహేందర్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి!
- ఈ ఉదయం లింగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- ఐదుగురి దుర్మరణం
- రహదారిపై ధర్నా చేపట్టిన బాధితుల బంధువులు
- పరామర్శకు వచ్చిన మంత్రి కాన్వాయ్ పై దాడి
ఈ నేపథ్యంలో, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మహేందర్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేశారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.