సినీ రంగంలో మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదు: 'రేసుగుర్రం’ నటుడు రవికిషన్
- ఇది మహిళలకే పరిమితం కాలేదంటున్న నటుడు!
- మగనటులను లైంగికంగా వేధించే హీరోయిన్లు బాగానే ఉన్నారు
- ‘రేసుగుర్రం’ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రవికిషన్
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో మగనటులను లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య ఎక్కువగానే ఉందని అన్నారు. అయితే, తనకు ఇలాంటి వేధింపులేమైనా ఎదురయ్యాయా అనే విషయాన్ని రవికిషన్ ప్రస్తావించలేదు. కాగా, తెలుగు, హిందీ, భోజ్ పురి భాషా చిత్రాల్లో నటించిన రవికిషన్, ‘కిక్ 2’, సుప్రీం, ’ఒక్క అమ్మాయి తప్ప’, ‘రాధ’, ‘లై’, ‘సాక్ష్యం’ సినిమాల్లో నటించాడు.