నాలుగేళ్లలో మోదీ ఏం చేశారని రాహుల్ అడుగుతున్నారు.. అసలు నాలుగు తరాలుగా కాంగ్రెస్ ఏం చేసింది?: అమిత్ షా
- కాంగ్రెస్ దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయింది?
- మేము అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు
- భారత్‌ను ప్రపంచంలో ఓ గౌరవనీయమైన స్థానంలో ఉంచాము
మోదీ సర్కారు మన దేశ సరిహద్దులను రక్షిస్తోందని అమిత్ షా అన్నారు. పాకిస్థాన్ రాత్రి, పగలు దాడులకు పాల్పడుతోందని, మోదీ సర్కారు పాలనలో మన దళాలు సర్జికల్ స్ట్రయిక్స్ జరిపాయని, 'భారత్ మాతా కి జై' నినాదాలు చేస్తూ తిరిగి వచ్చాయని అన్నారు. అలాగే, ఎన్డీఏ సర్కారు భారత్‌ను ప్రపంచంలో ఓ గౌరవనీయమైన స్థానంలో ఉంచిందని పేర్కొన్నారు.