చంద్రబాబు నాయుడిని ఈ నీళ్లు తాగమనండి.. అప్పుడు తెలుస్తుంది!: పవన్ కల్యాణ్
- చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ డైరెక్ట్ అటాక్
- సీఎంతో ఈ నీళ్లు తాగించాలని సూచన
- అప్పుడు కానీ సమస్య పరిష్కారం కాదన్న జనసేనాని
నీళ్ల బాటిల్‌ను చూపిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ నీళ్లు తాగాలని చెప్పాలని ప్రజలకు సూచించారు. అప్పుడు కానీ ఇక్కడి వారి బాధలు ఆయనకు తెలిసిరావన్నారు. పూర్తిగా కలుషితమైన ఈ నీటిని తాగితే కలరా, అంటువ్యాధులు రాకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు. పార్వతీపురం ఎవరొచ్చినా ఈ నీళ్లే ఇచ్చి తాగమని చెప్పాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి.. ఇలా ఎవరు వచ్చినా అందరికీ ఈ నీళ్లు ఇస్తేనే సమస్య పరిష్కారమవుతుందని పవన్ అన్నారు.