ఆ అధికారి స్ఫూర్తితోనే ‘ఆఫీసర్’..ఆయనలో నాగ్ పోలికలున్నాయి: దర్శకుడు వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ అధికారి స్ఫూర్తితోనే ‘ఆఫీసర్’..ఆయనలో నాగ్ పోలికలున్నాయి: దర్శకుడు వర్మ

  • కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కేఎమ్ ప్రసన్న 
  • ముంబైలో ఓ కేసుకు సంబంధించి ఆయన పనిచేశారు
  • ఈ కేసుకు సంబంధించిన విషయాలను 2010లో నాకు చెప్పారు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆఫీసర్’. హాలీవుడ్ మూవీ ‘టేకెన్’ ఆధారంగా ‘ఆఫీసర్’ ను రూపొందించారనే వదంతుల నేపథ్యంలో వర్మ స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కేఎమ్ ప్రసన్న జీవితకథతో దీనిని రూపొందిస్తున్నట్టు చెప్పారు. ముంబైకు చెందిన పేరున్న పోలీసు అధికారిపై వచ్చిన కేసు దర్యాప్తు చేసే ప్రత్యేక బృందంలో ఆయన్ని గతంలో నియమించారని చెప్పారు.

 ఈ కేసుకు సంబంధించిన విషయాలను 2010లో స్వయంగా ప్రసన్న తనకు వెల్లడించారని, ఆ విషయాలు విన్న తర్వాత ఓ సినిమా తీయాలనిపించిందని, ఆ స్ఫూర్తితోనే ‘ఆఫీసర్’ చిత్రాన్ని తెరకెక్కించానని అన్నారు. నాగార్జున, ప్రసన్నను కలిశాక తానో విషయం గమనించానని, వాళ్లిద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉందని, అంతేకాకుండా, ప్రసన్నలో కొంచెం నాగార్జున పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం, ముంబై క్రైమ్ బ్రాంచ్ లో అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ప్రసన్న పనిచేస్తున్నారని చెప్పారు.
Tollywood
varma
Nagarjuna
police prasanna

More Telugu News