కర్ణాటకలో కాషాయం తలపాగాతో షాక్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ
- బెల్గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒవైసీ
- జేడీఎస్ ను గెలిపించాలంటూ ఓటర్లకు విన్నపం
- బీజేపీ, కాంగ్రెస్ లపై మండిపాటు
మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ కు మద్దతుగా ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే తాను జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నానని ఒవైసీ చెప్పారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం గమనార్హం.