రెజ్లింగ్ లో విషాదం.. బౌట్ లో ప్రత్యర్థి ఎత్తుకి ప్రాణం కోల్పోయిన రెజ్లర్!
- మహారాష్ట్ర కోల్హాపూర్ లోని బండివేడ్ లో జ్యోతిబా జాతర నిర్వహణ
- జాతర సందర్భంగా నిర్వహించిన రెజ్లింగ్ పోటీలు
- డిఫెన్స్ ఆడుతూ ప్రత్యర్థిన విసిగించిన నీలేశ్ కందుర్కర్
ఈ క్రమంలో అదుపుతప్పిన నిలేశ్ కిందపడ్డాడు. శరీరం బరువు మొత్తం మెడపై పడడంతో స్పృహ కోల్పోయాడు. సంబరాల్లో ప్రత్యర్థి మునిగిపోగా, తేరుకున్న నిర్వాహకులు వెంటనే అతన్ని కోల్హాపూర్ లోని మెట్రో హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి కరాడ్ లోని కృష్ణ హాస్పిటల్ కు తరలించారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేసిన వైద్యులు నాలుగు రోజులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆటలో ఊహించని విధంగా జరిగిన ఘటన కావడంతో ప్రత్యర్థి పేరు వెల్లడించడం లేదని, జరిగిన సంఘటనతో అతను షాక్ లోకి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.