ప్రశ్నించాల్సిన వాళ్లను పవన్ కల్యాణ్ వదిలేశారు : బీదా రవిచంద్ర యాదవ్
- ఏపీ కోసం ఎవరితో కలిసి పోరాడాలో వాళ్లను పవన్ వదిలేశారు
- టీడీపీపై ఆరోపణలు చేయడం సబబు కాదు
- టీడీపీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూస్తోంది
వైసీపీ అధినేత జగన్ పై పలు కేసులు ఉన్నాయని, అలాగే, టీడీపీపై ఏదో ఒక కేసు ఉందని చూపెట్టేందుకే బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనని, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూసినా తామేమీ భయపడమని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడుపై ఏం కేసులు పెడతారు? నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయనపై ఎన్నో కేసులు పెట్టారని, అయినప్పటికీ చంద్రబాబును ఏం చేయలేకపోయారని అన్నారు.