మెగా హీరో కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా హీరో కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు

  • 'ఘాజీ' దర్శకుడితో వరుణ్ తేజ్ 
  • అంతరిక్షం నేపథ్యంలో కథ 
  • జార్జియాలో భారీస్థాయిలో సెట్   
వరుణ్ తేజ్ ఇప్పుడు మాంచి ఉత్సాహంతో వున్నాడు. 'ఫిదా' .. 'తొలిప్రేమ' సక్సెస్ లు ఆయనపై ఆయనకి మరింత నమ్మకాన్ని పెంచాయి. దాంతో ఆయన తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. 'ఘాజీ' సినిమాతో 'ఔరా'! అనిపించుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డితో వరుణ్ తాజా చిత్రం ఉండనుంది. ఈ కథ అంతరిక్షం నేపథ్యంలో కొనసాగుతుంది. 'వ్యోమగామి'గా ఈ సినిమాలో వరుణ్ కనిపిస్తాడు.

ఈ సినిమాలో యాక్షన్ తాలూకు సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఎంపిక చేసుకున్నారట. వాళ్ల ఆధ్వర్యంలో .. సహాయ సహకారాలతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియాలో భారీస్థాయిలో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి .. అక్కడ ఈ సీన్స్ ను షూట్ చేయనున్నారు. పాత్రపరంగా అవసరమైన శిక్షణ తీసుకోవడంలో వరుణ్ తేజ్ బిజీగా వున్నాడు. సముద్రం అంతర్భాగం .. సబ్ మెరైన్ నేపథ్యంలో ప్రేక్షకులను మెప్పించిన సంకల్ప్ రెడ్డి .. ఆ వెంటనే 'అంతరిక్షం' నేపథ్యంను ఎంచుకోవడం విశేషం.       
varun tej

More Telugu News