వందేమాతరం అనాల్సిందే... లేదంటే దేశం నుంచి వెళ్లిపోవాలి: ఎమ్మెల్యే రాజా సింగ్ లోధా
- ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ లో చేరాలి
- లేదంటే జాతికి సేవ చేయలేరు
- వందేమాతరం, భారత్ మాతాకీ జై అని అందరూ అనాల్సిందే
- లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలి
‘‘భారత్ లో నివసించే వారు ఎవరైనా కానీ మతాలకు అతీతంగా భారత్ మాతాకీ జై, వందేమాతరం అనాల్సిందే. లేదంటే వారు ఈ దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలి. శుత్రుదేశాన్ని, ఉగ్రవాదులను పొగిడే ప్రజలను ప్రపంచంంలో ఏ దేశం కూడా భరించదు. ఏ ఇతర దేశంలోనూ భారత్ మాతాకీ జై అంటే ఉపేక్షించరు. కానీ మన దేశంలో పాకిస్థాన్ జిందాబాద్ అనేవారు, అఫ్జల్ గురు వంటి ఉగ్రవాదులను కొనియాడే ప్రజలు ఉన్నారు’’ అని రాజాసింగ్ అన్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా, మతమార్పిడులకు పాల్పడుతున్న క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడాలని హిందువులకు ఆయన పిలుపునిచ్చారు.