తిరువణ్ణామలైలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
- అరుణాచల గిరి ప్రదక్షిణలో తీవ్ర విషాదం
- ఇడుక్కు పిల్లయార్ ఆలయ గుహలో చిక్కుకున్న భక్తుడు
- ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఏపీ వాసి మణికుమార్
- అధిక బరువు ఉన్నవారు గుహలోకి వెళ్లొద్దని ఆలయ సూచన
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో విషాదం చోటుచేసుకుంది. గిరి ప్రదక్షిణ మార్గంలోని ఓ ఇరుకైన గుహలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని మణికుమార్ (36)గా గుర్తించారు.
మణికుమార్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం సాయంత్రం అరుణాచలేశ్వర స్వామి దర్శనం నిమిత్తం తిరువణ్ణామలై చేరుకున్నారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయార్ ఆలయానికి వెళ్లారు. ఈ ఆలయంలోని ఇరుకైన గుహ గుండా ఒకవైపు నుంచి ప్రవేశించి, మరోవైపు నుంచి బయటకు రావడం ఇక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనిని భక్తులు 'మోక్ష మార్గం'గా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ క్రమంలో, అధిక బరువు కలిగిన మణికుమార్ ఆ గుహలోకి ప్రవేశించగా, మధ్యలోనే ఇరుక్కుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సరిపడా గాలి అందక ఊపిరి ఆడకపోవడంతో స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. వెంటనే 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తిరువణ్ణామలై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.