కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. 'ఎక్స్' బయో మార్చేసిన ధర్మేంద్ర ప్రధాన్
- కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- కొద్ది గంటల్లోనే 'ఎక్స్' బయో నుంచి 'కేంద్ర మంత్రి' హోదా తొలగింపు
- నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కీలక నిర్ణయం
- దేశ వ్యతిరేక శక్తులు లబ్ధి పొందకుండా ఉండేందుకేనని వెల్లడి
నీట్ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన తన 'ఎక్స్' ఖాతా బయోలో మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి "కేంద్ర విద్యాశాఖ మంత్రి" అనే హోదాను తొలగించి, ప్రస్తుతం తనను "సంబల్‌పూర్ ఎంపీ"గా పేర్కొన్నారు. అలాగే బీజేపీ కార్యకర్తగా తన వివరాలను యథాతథంగా కొనసాగించారు.
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ, విద్యావ్యవస్థలోని అవకతవకలపై విద్యార్థులు నుంచి వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన దేశ వ్యతిరేక శక్తులు ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని గందరగోళం సృష్టించకుండా నిరోధించేందుకే తాను పదవి నుంచి వైదొలగినట్లు వెల్లడించారు.
మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు అంగీకరించిన ఆయన, బాధ్యత వహించేందుకు తాను ఎన్నడూ వెనుకాడబోనని స్పష్టం చేశారు. "పరీక్ష మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి నష్టపోకూడదని, ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే నా సంకల్పం" అని పేర్కొన్నారు. గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని, ఇది కేవలం వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని ఆయన వివరించారు.