భారత్-పాక్ సరిహద్దులో రకుల్ ప్రీత్ సింగ్.. జవాన్లతో కలిసి గణతంత్ర వేడుకలు
- ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా వాఘా సరిహద్దుకు
- బాలీవుడ్ నటులు, దర్శక నిర్మాత నీరజ్ పాండేతో కలిసి సందడి
- జవాన్లతో సెల్ఫీలు.. ట్విట్టర్లో పోస్టులు
రకుల్ ప్రీత్ నటించిన ‘అయ్యారీ’ సినిమా ఈనెల 26నే విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ షార్ట్ ఫిల్మ్‌ను పోస్టు చేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరింది. తమలో స్ఫూర్తి నింపుతున్న జాతీయ జెండాకు సలాం చేయాలని కోరింది. మనోజ్ బాజ్‌పేయి కూడా తన ట్విట్టర్ ఖాతాలో బీఎస్ఎఫ్ జవాన్లను కలిసి ఫొటోలను పోస్టు చేశాడు.