భార్య ఫొటోకు పూలు పెట్టాకే ఆటో ముందుకు.. హృదయాలను కదిలిస్తున్న డ్రైవర్ ప్రేమ
- భార్య జ్ఞాపకంతో రోజూ ఆటో నడిపే వృద్ధుడు
- ఫొటోలకు పూలు సమర్పించిన తర్వాతే విధులకు శ్రీకారం
- భార్య మరణించి ఎనిమిదేళ్లు గడిచినా తగ్గని ప్రేమ
- కొడుకు, మనవళ్లు ఉన్నా ఆటో నడపడమే ఇష్టం
- వైరల్‌గా మారిన వీడియోకు భావోద్వేగ స్పందనలు
ప్రేమకు కాలంతో సంబంధం లేదని అంటారు. ఆ మాటను నిజం చేస్తున్నాడు బెంగళూరుకు చెందిన ఓ వృద్ధ ఆటో డ్రైవర్. భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా.. ఆమెను మరిచిపోలేక రోజూ ఆటోలోని ఆమె ఫొటోలకు పూలు సమర్పించిన తర్వాతే పనిని ప్రారంభిస్తాడు. అతడి నిశ్శబ్ద ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది.
బెంగళూరులోని ఇందిరానగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ వృద్ధ ఆటో డ్రైవర్‌ను కంటెంట్ క్రియేటర్ ఆశిష్ మాథ్యూ గమనించాడు. ఆటోలో ఏదో జాగ్రత్తగా పూలు అలంకరిస్తుండటంతో ఆసక్తిగా దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. పూలు ఎవరికి పెడుతున్నారని అడగ్గా, ఆటోలో ఉన్న ఫ్రేమ్ చేసిన ఫొటో వైపు చూపిస్తూ ‘ఆమె నా భార్య’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత కెమెరా ఆటోలోని మిగతా భాగాన్ని చూపించగా, భార్యకు చెందిన పలు ఫొటోలు కనిపించాయి. భార్య మరణించి ఎనిమిదేళ్లు గడిచినా, ఆమె జ్ఞాపకాన్ని తనతోనే తీసుకెళుతున్నానని చెప్పాడు. రోజూ ఆటో నడిపే ముందు ఆమె ఫొటోలకు తాజా పూలు సమర్పించడం తనకు అలవాటైందని తెలిపాడు. తన రోజువారీ జీవితంలో ఆమె ఇంకా తనతోనే ఉందనే భావన కలిగిస్తుందని పేర్కొన్నాడు.
ఆ వృద్ధుడికి కొడుకు, కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణ ఉన్నప్పటికీ భార్య లేని లోటు మాత్రం ఎప్పటికీ తీరలేదని చెప్పాడు. ఇక పని మానేసి ఇంట్లోనే ఉండాలని కొడుకు పలుమార్లు కోరినా ఆయన అంగీకరించలేదట. ఇంట్లో ఒంటరిగా ఉండటం కంటే ఆటో నడిపితే కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుందని, అలా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పినట్లు ఆశిష్ మాథ్యూ వీడియోలో వివరించాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 28 లక్షలకు పైగా వీక్షణలు సాధించింది. జీవిత భాగస్వామి పట్ల ఇంతటి ప్రేమ, అంకితభావం అరుదుగా కనిపిస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమైన బంధం మరణంతో ముగిసిపోదని, జ్ఞాపకాల్లో జీవితాంతం కొనసాగుతుందనే విషయాన్ని ఈ ఆటో డ్రైవర్ మరోసారి గుర్తు చేశాడని పలువురు స్పందించారు.