కృష్ణగారికి 20 సినిమాలు తెచ్చిపెట్టిన హిట్ మూవీ అదే!

Narayana Babu Interview
  • కృష్ణ కెరియర్ లో మైలురాయి 'గూఢచారి 116'
  • ఆయననే హీరోగా అనుకున్న మల్లికార్జున్ రావు 
  • అతికష్టం మీద ఒప్పుకున్న డూండీ 
  • కెరియర్ పరంగా దూసుకుపోయిన కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ .. ఒకప్పుడు మాస్ ఇమేజ్ కి కేరాఫ్ అడ్రెస్. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చి, తన కెరియర్ ను పరిగెత్తించిన కథానాయకుడు ఆయన. ఒక వైపున విలేజ్ నేపథ్యంలో కథలతో మెప్పిస్తూ, మరో వైపున యాక్షన్ సినిమాలలో రాణించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. అలాంటి కృష్ణ కెరియర్ ను మలుపు తిప్పిన సినిమాలలో 'గూఢచారి 116' ఒకటి. ఈ సినిమాను గురించి దర్శకుడు మల్లికార్జున్ రావు తనయుడు నారాయణ బాబు 'సుమన్ టీవీ'తో మాట్లాడారు.

"మా నాన్న మల్లికార్జున్ రావు గారు సుందర్ లాల్ నహతా గారి సంస్థలో పనిచేసేవారు. నాన్నంటే ఆయనకి చాలా అభిమానం .. నమ్మకం. ఎందుకంటే వాళ్ల బ్యానర్ పై వచ్చే సినిమాలన్నిటికీ సంబంధించిన పనులను నాన్న దగ్గరుండి చూసుకునేవారు. సుందర్ లాల్ నహతాగారు నాన్నకి 'శాంతి నివాసం' సినిమా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో అది సీఎస్ రావుగారికి వెళ్లింది. దాంతో నాన్న చాలా అప్సెట్ అయ్యారు. అయినా వెంటనే తేరుకుని ముందుకు వెళ్లారు" అని చెప్పారు. 

'గూఢచారి 116' సినిమాను కృష్ణగారితో చేయాలని నాన్న అనుకున్నారు. ఆయనతోనే చేస్తానని పట్టుబట్టారు. అయితే అప్పట్లో సుందర్ లాల్ నహతా గారికంటే కూడా 'డూండీ' గారిని ఒప్పించడం చాలా కష్టమైన విషయం. ఒక పట్టాన ఆయన ఒప్పుకునేవారు కాదు. అయినా ఆయనను ఒప్పించారు. అలా 'గూఢచారి 116' తెరకెక్కింది. ఈ సినిమా రిలీజైన మరుసటి రోజునే కృష్ణగారు 20 సినిమాలలో బుక్ అయ్యారు. అప్పటికీ .. ఇప్పటికీ ఇది రికార్డే" అని అన్నారు.

Advertisement
Superstar Krishna
Gudachari 116
Mallikarjun Rao
Telugu Cinema Records
Tollywood Spy Thriller
Krishna Film Career

More Telugu News