ఓటీటీ తెరపైకి మలయాళ ఫాంటసీ హారర్ థ్రిల్లర్!
- మలయాళ సినిమాగా 'సీక్రెట్ ఆఫ్ కళింగ'
- ప్రధానమైన పాత్రను పోషించిన ధ్యాన్ శ్రీనివాసన్
- జూన్ 18న విడుదలైన సినిమా
- ఈ నెల 24 నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్
మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక హారర్ థ్రిల్లర్ వస్తుందంటే చాలు, ఆ సమయం కోసం ఓటీటీ ప్రేక్షకులు వేయికళ్లతో వెయిట్ చేస్తుంటారు. హారర్ కి ఫాంటసీ తోడైతే ఇక ఆ ఉత్సాహమే వేరని చెప్పాలి. అలాంటి ఏ సినిమా కోసమైతే ఓటీటీ ఆడియన్స్ కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారో, ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఆ మలయాళ సినిమా పేరే 'ది సీక్రెట్ ఆఫ్ కళింగ'. ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, సనీష్ ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించాడు.
సాధారణంగా హారర్ సినిమాలకు సస్పెన్స్ తోడవుతూ ఉంటుంది. కొన్ని కథల్లో హారర్ తో కామెడీ జోడీ కడుతుంది. ఇక అప్పుడప్పుడు మిస్టరీ కనెక్ట్ అవుతుంటుంది. అయితే ఈ సారి అందుకు భిన్నంగా హారర్ కి ఫాంటసీ తోడైంది. దాంతో ఈ కంటెంట్ అందరిలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జూన్ 18వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
'ఐరా' బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువల పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. విమల్ జిత్ విజయన్ అందించిన నేపథ్య సంగీతం, ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందనే టాక్ వచ్చింది. ఆశ్రిత్ సంతోష్ అందించిన ఫొటోగ్రఫీ కూడా ప్రశంసలు అందుకుంది. ఇక స్క్రీన్ ప్లే వైపు నుంచి కూడా ఈ కంటెంట్ శభాష్ అనిపించుకుంది. ముఖ్యమైన పాత్రలలో మాళవిక మీనన్ .. అల్తాఫ్ సలీమ్ .. రియాజ్ ఖాన్ .. మెరీనా మైఖేల్ నటించారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ రావడం ఖాయమనే ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి.