కృష్ణంరాజు గారి మనస్తత్వమే ప్రభాస్ కి వచ్చింది: కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణంరాజు గారి మనస్తత్వమే ప్రభాస్ కి వచ్చింది: కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి

  • ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు 
  • సరదాగా ఉండటమంటే ఆయనకి ఇష్టం
  • అందరికీ కృష్ణంరాజు అండగా నిలిచారు    
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను గురించి ఆమె ప్రస్తావిస్తూ .. "ప్రభాస్ మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ప్రభాస్ కి కృష్ణంరాజు మనస్తత్వమే వచ్చింది. ఆదరించే విషయంలో .. అందరికీ భోజనాలు పెట్టే విషయంలో అచ్చు అలాగే ఉంటాడు. ఎప్పుడూ సరదాగా ఉండటమంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. కుటుంబ సభ్యులమంతా చాలా చనువుగా ఉంటాం" అన్నారు.

"మొదటి నుంచి కూడా కృష్ణం రాజు గారు ఆయన ఫ్యామిలీలోని వాళ్లందరికీ గాడ్. బ్రదర్స్ .. సిస్టర్స్ .. మేనకోడళ్లు .. పెదనాన్నగారి పిల్లలు .. చిన్నాన్న గారి పిల్లలు .. ఇలా వీళ్లు .. వాళ్లు అని కాదు, అందరికీ అండగా నిలబడుతుంటారాయన. 'దశరథ మహారాజుకి రాముడు ఎలాగో .. నాకు నా కొడుకు అలాగమ్మా' అని మా మామగారు నాతో అంటుండేవారు. 'అలాంటి కొడుకును కన్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని' అనేవారు. మా మామగారు నన్నెంతో అభిమానంతో చూసుకునేవారు. కృష్ణంరాజు గారిని చాలా బాగా చూసుకుంటాననే నమ్మకం నాపై మా మామగారికి ఉండేది" అని చెప్పుకొచ్చారు.  
krishnamraju
shyamala devi
prabhas

More Telugu News