ఆరో వికెట్ కూడా డౌన్ ... నాటి చెత్త రికార్డును బ్రేక్ చేస్తారా ఏంటి.... క్రికెట్ పై సోషల్ మీడియా!
- 2000 సంవత్సరంలో చెత్త పరుగుల రికార్డు
- నాడు 54 పరుగులకే ఆలౌటైన టీమిండియా
- అప్పుడు కూడా ప్రత్యర్థి శ్రీలంకే
- నాటి రోజులు గుర్తుకు తెస్తున్న ధర్మశాల మ్యాచ్
షార్జాలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక, 299 పరుగులు చేయగా, భారత జట్టులో ఆర్పీ సింగ్ మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. గంగూలీ 3, టెండూల్కర్ 5, యువరాజ్ 3, కాంబ్లీ 3, బదానీ 9, సింగ్ 11, దహియా 4, జోషి 4, అగార్కర్ 2, జహీర్ ఖాన్ 1, బీకేవీ ప్రసాద్ 3 పరుగులు చేశారు. ఆ మ్యాచ్ లోని వరస్ట్ రికార్డు నేడు గుర్తుకు వస్తోంది. మరో 25 పరుగులకు స్కోర్ బోర్డుకు కలపకుండా అందరూ వెనుదిరిగితే, నాటి చెత్త రికార్డు స్థానంలో మరో చెత్త రికార్డు వచ్చి చేరుతుంది.