12న పెళ్లి, 26న రిసెప్షన్, మరుసటి రోజే సౌతాఫ్రికా టూర్: కోహ్లీ బిజీ షెడ్యూల్
- 12న ఇటలీలో విరాట్, కోహ్లీ వివాహం
- ముస్తాబైన వేదిక
- 26న ముంబైలో రిసెప్షన్
- వీఐపీలు, సెలబ్రిటీలకు ఆహ్వానాలు
రిసెప్షన్ కు బాలీవుడ్, క్రికెట్, బీసీసీఐ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వీఐపీలు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. రిసెప్షన్ మరుసటి రోజే, అంటే డిసెంబర్ 27న భారత జట్టు సౌతాఫ్రికా బయలుదేరుతుంది. అంటే మరో నెలన్నర రోజులు కోహ్లీ ఫుల్ బిజీ అన్నమాట. గత కొంత కాలంగా వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్నా, వీరిద్దరూ మాత్రం స్పందించలేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక రిసెప్షన్ ఆహ్వానాలు కూడా వెళ్లిన తరువాత, వీరి పెళ్లిపై ఉన్న అనుమానాలు తొలగిపోయినట్లయింది.