టీఆర్ఎస్ నేత ఇంట్లో గంజాయి పెట్టిరమ్మని సర్పంచ్ పై కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు ఒత్తిడి... సంచలనం కలిగిస్తున్న ఆడియో!
- కొత్త చిక్కుల్లో పడ్డ శ్రీధర్ బాబు
- గంజాయి అమ్మకం కేసులో ఇరికించాలని చూసిన శ్రీధర్ బాబు
- సుదర్శన్ ఇంటికెళ్లి గంజాయి పెట్టి రావాలని ఓ సర్పంచ్ పై ఒత్తిడి
- వెలుగులోకి వచ్చిన ఆడియో - కేసు నమోదు
ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, శ్రీధర్ బాబు ప్రమేయంపై విచారణ జరుగుతోందని అన్నారు. మీడియాలో వస్తున్న ఆడియోలో సుదర్శన్ అనే సర్పంచ్ ని శ్రీధర్ బాబు ఒత్తిడి చేస్తున్న సంభాషణలు వినిపిస్తున్నాయి. చిక్కడపల్లిలోని కిషన్ రెడ్డి ఇంటిలో గంజాయిని పెట్టించాలని ఆయన అడుగుతున్నట్టు ఉంది. నేడు వినాయకచవితని గుర్తు చేసిన సుదర్శన్, తరువాత ఆ పని చేస్తానని చెబుతున్నట్టు వినిపిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై శ్రీధర్ బాబు ఇంకా స్పందించలేదు.