క్రికెట్ - బాలీవుడ్ జంట విరాట్ కొహ్లీ, అనుష్క శర్మలు ఎప్పుడూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా వారిద్దరూ చేసిన వాణిజ్య ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వస్త్రాల బ్రాండ్ కోసం వీరిద్దరూ నటించిన ప్రకటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ పెళ్లి జంట చేసుకునే ప్రమాణాలను వీరిద్దరూ చెప్పుకుంటూ, చివరికి విరాట్, అనుష్కకు ప్రపోజ్ చేయడం, అందుకు అనుష్క ఓకే చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు.