ఆస్ట్రేలియా కొంపముంచిన డక్వర్త్ లూయిస్... తొలి టీ-20లో భారత్ ఘన విజయం
- 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం
- 5.3 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
- కోహ్లీ 22, శిఖర్ ధావన్ 15 పరుగులు
- టీ-20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి
ఆపై బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 11, శిఖర్ ధావన్ 15, కోహ్లీ 22 పరుగులు చేసి సునాయాసంగా విజయ తీరాలకు చేర్చారు. మరో మూడు బంతులు మిగిలుండగానే... అంటే 5.3 ఓవర్లలోనే భారత జట్టు 49 పరుగులు సాధించింది. దీంతో టీ-20 సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
అంతకుముందు భారత బౌలర్లు రాణించడంతో ఐదుగురు ఆసీస్ ఆటగాళ్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఒక దశలో మ్యాచ్ రద్దవుతుందని క్రీడాభిమానులు భావించినప్పటికీ, వర్షం తెరిపి ఇవ్వడంతోనే ఆటను కొనసాగించాలని అంపైర్లు నిర్ణయించారు. కాగా, వర్షం పడకుండా ఉంటే తమకు కూడా విజయావకాశాలు ఉండేవని, భారత జట్టు చక్కగా బౌలింగ్ చేసిందని ఆస్ట్రేలియా కెప్టెన్ వ్యాఖ్యానించారు.