ఆసీస్-ఇండియా తొలి టీ20 జరగడం సందేహమే!
- తొలి టీ20కి వర్ష గండం
- గత రెండు రోజులుగా రాంచీలో వర్షం
- ఈరోజు కూడా వర్షం పడే అవకాశం
గత రెండు రోజులుగా రాంచీలో వర్షాలు కురుస్తున్నాయి. నగరమంతా జలమయమైంది. ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీంతో, క్రికెట్ అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా, జార్ఖండ్ కు చెందిన అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. ధోనీ హోమ్ టౌన్ రాంచీ కావడమే దీనికి కారణం. సొంత గ్రౌండ్ లో ధోనీ ఆటను చూడాలని వీరంతా ఉవ్విళ్లూరుతున్నారు.