పేరు మార్చుకున్న సినీ నటి సదా.. ఇకనైనా కలిసొచ్చేనా!
- న్యూమరాలజిస్టు సలహా మేరకు పేరు మార్చుకున్న సదా
- సదా ఇకపై సధా సయ్యద్
- 'జయం' సినిమాతో తెరంగేట్రం
- 'అపరిచితుడు', 'చుక్కల్లో చంద్రుడు', 'ఔనన్నా కాదన్నా' వంటి సినిమాల్లో నటించిన సధా
వెండితెరపై నెంబర్ గేమ్ లో వెనకబడిన సదా మరోసారి సత్తాచాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక న్యూమరాలజిస్ట్ ను సంప్రదించింది. అతని సలహా మేరకు తన పేరును మార్చుకుంది. ఇప్పటి వరకు సదాఫ్, సదాగా ఉన్న తన పేరు ఇప్పుడు సధా సయ్యద్ గా మారినట్టు తెలిపింది. కొత్తపేరుతో తనకు అంతా కలిసొస్తుందని ఆశిస్తోంది.