మానవునికి 400 ఏళ్లు బతికే సామర్థ్యం ఉంది: రాందేవ్ బాబా
- మానవ శరీరం 400 ఏళ్లు మనుగడ సాగించేలా రూపొందింది
- అనారోగ్యకర అలవాట్లతో దానిని పాడుచేసుకుంటున్నాం
- ఆరోగ్యకర అలవాట్లతో అమిత్ షా బరువు తగ్గారు
- ఉడికించిన వెజిటబుల్స్, సూప్ తో ఆయన 38 కేజీల బరువు తగ్గారు
- అనారోగ్యకర భోజనాన్ని వదిలెయ్యాలి
అనారోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతూ మందులతో సహవాసం చేస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కచ్చితమైన డైట్ పాటించడం ద్వారా 38 కేజీల బరువు తగ్గారని ఆయన వెల్లడించారు. ఆయన మధ్యాహ్న భోజన పరిమాణం తగ్గించడంతో పాటు, రాత్రుళ్లు కేవలం ఉడకబెట్టిన కూరగాయలు, సూపు మాత్రమే తీసుకున్నారని, దీంతో ఆయన బరువు గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. అనారోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడం తగ్గించాలని ఆయన సూచించారు.