ప్రభాస్ తో సినిమా చేయడం లేదన్న రోహిత్ శెట్టి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ తో సినిమా చేయడం లేదన్న రోహిత్ శెట్టి!

జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ప్రభాస్ బాలీవుడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కరణ్ జొహార్ బ్యానర్ పై ఆయన రెండు సినిమాలు చేసే ఛాన్స్ వున్నట్టుగా చెప్పుకున్నారు. ఆ తరువాత ఆయనతో రోహిత్ శెట్టి ఒక సినిమా చేయనున్నాడనే టాక్ వినిపించింది.

ఈ ప్రచారం గురించి కరణ్ జొహార్ ఏమీ మాట్లాడలేదు గానీ .. రోహిత్ శెట్టి మాత్రం స్పందించాడు. ప్రభాస్ తో తాను సినిమా చేయనున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని ఆయన చెప్పాడు. ప్రభాస్ ను తాను కలుసుకోవడం గానీ .. మాట్లాడటం గాని జరగలేదని అన్నాడు. ప్రస్తుతానికైతే ప్రభాస్ తో సినిమా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. దాంతో కొన్ని రోజులుగా షికారు చేస్తోన్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టు అయింది. 
prabhas
rohith shetti

More Telugu News