వచ్చేనెల 24నే 'యుద్ధం శరణం'
ఆర్. వి. మారి ముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రేపటితో షూటింగ్ పూర్తిచేసుకోనుంది. సాధ్యమైనంత త్వరలో టీజర్ ను రిలీజ్ చేసి, వచ్చేనెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పూర్తి వినోదంతో పాటు సమాజానికి అవసరమైన సందేశం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో చైతూ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.