ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయి: చంద్రబాబు
Add ap7am to your home Screen

ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయి: చంద్రబాబు

ప్రతిపక్ష నేతలు ఉద్దేశ‌పూర్వ‌కంగానే రైతులను రెచ్చగొడుతున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రైతులకు త‌మ ప్ర‌భుత్వం మంచి ప్యాకేజీని అందిస్తుంద‌ని, రెండేళ్లలోపు పునరావాస పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రైతులు అత్యాశకు పోకూడ‌ద‌ని, అలా చేస్తే వారికే న‌ష్ట‌మ‌ని, అడ్డు తగిలితే తమ పని తాము చేసుకుపోతామని వ్యాఖ్యానించారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయ‌న తెలిపారు.
chandrababu
polavaram

More Telugu News