50 గంటల బ్యాటరీ.. ఏఐ ఫీచర్లు.. యాపిల్ కొత్త వాచ్‌లు అదుర్స్
- యాపిల్ వాచ్ సిరీస్ 12 ధర రూ.56,900 నుంచి ప్రారంభం
- వాచ్ అల్ట్రా 4 ప్రారంభ ధర రూ.1,09,900
- ఎయిర్‌పాడ్స్ 5 ధర రూ.14,900 నుంచి అందుబాటులోకి
- వాచ్ సిరీస్ 12లో హార్ట్‌రేట్ ప్రతి 5 సెకన్లకు ట్రాక్
- ఎయిర్‌పాడ్స్ 5లో ఏఎన్‌సీతో పాటు సిరి ఏఐ, లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లు
యాపిల్ సరికొత్త వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ పేరుతో జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5ను ప్రకటించింది. ఆరోగ్య పర్యవేక్షణ, బ్యాటరీ సామర్థ్యం, ఏఐ ఫీచర్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
వాచ్ సిరీస్ 12లో కొత్త ఫీచర్లు
వాచ్ సిరీస్ 12లో కొత్త ఎస్11 చిప్‌ను అమర్చింది. ఇది అత్యంత శక్తిమంతమైన వేరబుల్ చిప్ అని యాపిల్ తెలిపింది. హార్ట్‌రేట్‌ను ఇకపై ప్రతి 5 సెకన్లకు ఒకసారి పరిశీలిస్తుంది. 42ఎంఎం, 46ఎంఎం సైజుల్లో వాచ్ అందుబాటులో ఉంటుంది.
కొత్త హెల్త్ సెన్సింగ్ సిస్టమ్‌తో హెచ్‌ఆర్‌వీ ట్రాకింగ్ మరింత తరచూ జరుగుతుంది. రెడీనెస్ స్కోర్ కూడా అందిస్తోంది. రోజువారీ శారీరక శ్రమ, ట్రైనింగ్ లోడ్, ఆరోగ్య వివరాలు, నిద్ర ఆధారంగా 0 నుంచి 10 వరకు స్కోర్ ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవాలా, వ్యాయామం కొనసాగించాలా అన్న దానిపై సూచనలు చేస్తుంది.
రోజువారీ బ్యాటరీ 24 గంటల వరకు ఉంటుంది. అవుట్‌డోర్ వర్కౌట్‌లో 10 గంటల వరకు పనిచేస్తుంది. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అల్యూమినియం, టైటానియం, సిరామిక్ ఫినిష్‌లలో లభిస్తుంది.
అల్ట్రా 4లో భారీ బ్యాటరీ
వాచ్ అల్ట్రా 4లోనూ ఎస్11 చిప్, హెల్త్ సెన్సింగ్ సిస్టమ్ ఉన్నాయి. సాధారణ వినియోగంలో 50 గంటల వరకు బ్యాటరీ ఉంటుంది. లో పవర్ మోడ్‌లో 84 గంటల వరకు పనిచేస్తుంది. పూర్తి జీపీఎస్, హార్ట్‌రేట్ ట్రాకింగ్‌తో 25 గంటల వరకు వర్కౌట్ చేయొచ్చు. మ్యాక్స్ ఎక్స్‌టెండెండ్ వర్కౌట్ మోడ్‌లో 45 గంటల వరకు బ్యాటరీ ఉంటుంది.
ఎయిర్‌పాడ్స్ 5లో మెరుగైన ఏఎన్‌సీ
ఎయిర్‌పాడ్స్ 5లో ఓపెన్ ఇయర్ డిజైన్‌తో మెరుగైన ‘యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్’ (ఏఎన్‌సీ) అందిస్తోంది. ఎయిర్‌పాడ్స్ 4తో పోలిస్తే 50 శాతం వరకు ఎక్కువ శబ్దాన్ని తగ్గిస్తుందని యాపిల్ తెలిపింది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్, అడాప్టివ్ ఆడియో, కన్వర్జేషన్ అవేర్‌నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కొత్త అకౌస్టిక్ ఆర్కిటెక్చర్, అడాప్టివ్ ఈక్యూతో సౌండ్ నాణ్యత మెరుగుపడుతుంది. ఐఓఎస్ 27తో పనిచేసే అనుకూల ఐఫోన్లలో సిరి ఏఐ, హెడ్ జెస్చర్ రెస్పాన్స్, లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయాలు లభిస్తాయి.
ధరలు, విక్రయాలు
యాపిల్ వాచ్ సిరీస్ 12 అల్యూమినియం మోడల్ ధర రూ.56,900. టైటానియం రూ.99,900, సిరామిక్ రూ.1,24,900. వాచ్ అల్ట్రా 4 ధర రూ.1,09,900. టైటానియం లూప్ మోడల్ రూ.1,24,900.
ఎయిర్‌పాడ్స్ 5 ధర రూ.14,900. వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుతో ధర రూ.17,900. మూడు ఉత్పత్తులకు ఇవాళ్టి నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 18న విక్రయాలు మొదలవుతాయి.