రూ.12 కోట్ల పోర్షేలో దూసుకెళ్తున్న యాపిల్ కొత్త సీఈఓ!
- టెర్నస్ సెప్టెంబర్ 1న యాపిల్ సీఈఓగా బాధ్యతలు
- ఆయన దగ్గర అరుదైన పోర్షే 935
- ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ కార్లు 77 మాత్రమే
- పోర్షే 935 విలువ 15 లక్షల డాలర్లకు పైగానే
- లగునా సెకాలో టెర్నస్ రేసింగ్
యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. టెక్ దిగ్గజానికి నేతృత్వం వహించే టెర్నస్‌కు కార్లపై, ముఖ్యంగా రేసింగ్‌పై భారీ ఆసక్తి ఉందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అత్యంత అరుదైన పోర్షే 935లో రేసింగ్ చేస్తుంటారు.
2019లో తయారైన పోర్షే 935 కార్లు ప్రపంచవ్యాప్తంగా 77 మాత్రమే ఉన్నాయి. ఈ కారు ధర అప్పట్లో 8.17 లక్షల డాలర్లు. ప్రస్తుతం దీని విలువ 15 లక్షల డాలర్లకు పైగా ఉంటుందని ఆటో రంగం వర్గాలు చెబుతున్నాయి. ఇది రోడ్లపై నడపడానికి అనుమతి లేని ట్రాక్ కారు.
ఈ కారులో 3.8 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్ ఉంది. ఇది 700 పీఎస్ శక్తిని ఇస్తుంది. ఏడు గేర్ల పీడీకే గేర్‌బాక్స్ ఉంటుంది. పోర్షే 911 జీటీ2 ఆర్ఎస్ ఆధారంగా దీన్ని రూపొందించారు. పాతకాలపు ‘మోబీ డిక్’ రేసింగ్ కారును గుర్తు చేసేలా దీని డిజైన్ ఉంటుంది.
టెర్నస్ కాలిఫోర్నియాలోని లగునా సెకా రేస్వేలో తరచూ రేసింగ్ చేస్తుంటారు. ఈ ట్రాక్‌లో ఆయన ల్యాప్ సమయం 1 నిమిషం 40 సెకన్ల కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. పోర్షే కూడా ఆధునిక 935ను 2018లో లగునా సెకాలోనే ఆవిష్కరించింది.
టెక్ రంగంలో టెర్నస్ ప్రస్థానం కూడా ప్రత్యేకమే. 2001లో యాపిల్‌లో చేరిన ఆయన ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఐఫోన్, మ్యాక్, యాపిల్ వాచ్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకంగా పనిచేశారు. ఇప్పుడు సీఈఓగా ఏఐ పోటీ, ఉత్పత్తుల అమ్మకాల మందగమనం, సరఫరా సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 9న జరగనున్న యాపిల్ ఈవెంట్ ఆయనకు తొలి పెద్ద పరీక్ష కానుంది.