చివరిదాక... కేసీఆర్!: రాహుల్ రామకృష్ణ పోస్ట్ వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చివరిదాక... కేసీఆర్!: రాహుల్ రామకృష్ణ పోస్ట్ వైరల్

Rahul Ramakrishna viral post says KCR until the end
  • సంచలనంగా మారిన రాహుల్ రామకృష్ణ ట్వీట్
  • మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • గతంలో కూడా సంచలనం సృష్టించిన రాహుల్ ట్వీట్లు

టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తన రాజకీయ, సామాజిక అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు బయటపెట్టే రాహుల్... తాజాగా "చితి చివరిదాక... కేసీఆర్!" అని పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


పోస్ట్ ఏ సందర్భాన్ని పురస్కరించుకుని చేశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు, కేసీఆర్ అభిమానులు ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ మద్దతు తెలుపుతుండగా, మరికొందరు నెటిజన్లు అతడిపై వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.


రాహుల్ రామకృష్ణ రాజకీయ అంశాలపై స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో జనసైనికుల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అలాగే గతంలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, కేటీఆర్‌లను ట్యాగ్ చేస్తూ చేసిన పలు ట్వీట్లు కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి.


'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'బ్రోచేవారెవరురా', 'జాతి రత్నాలు', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఓం భీమ్ బుష్' వంటి చిత్రాల్లో తన ప్రత్యేకమైన కామెడీ, సంభాషణలతో అలరించిన రాహుల్ రామకృష్ణ... నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు పొందాడు.

Advertisement
Rahul Ramakrishna
KCR
BRS Party
Telangana Politics
Tollywood Actor Viral Post
K Chandrashekar Rao

More Telugu News