100 కోట్ల క్లబ్ దిశగా 'ఇరుముడి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కోట్ల క్లబ్ దిశగా 'ఇరుముడి'

Irumudi Movie Update
  • ఈ నెల 21వ తేదీన విడుదలైన 'ఇరుముడి'
  • తొలి రోజున 24 కోట్లకు పైగా వసూళ్లు 
  • మూడు రోజుల్లో రాబట్టిన వసూళ్లు 75 కోట్లు
  • రవితేజ కెరియర్లో మరో  బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా

రవితేజ అంటే చాలు మాస్ ఆడియన్స్ ఊగిపోతారు. ఆయన సినిమాలలో యాక్షన్ ఉంటుంది .. ఎమోషన్ ఉంటుంది .. తనదైన కామెడీ ఉంటుంది. రొమాంటిక్ గా సాగిపోయే సాంగ్స్ ఉంటాయి. ఫైనల్ గా వీటన్నిటికీ మాస్ టచ్ ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం ఆయన కాస్త డిఫరెంట్ గా డివోషనల్ టచ్ ఇస్తూ, 'ఇరుముడి' సినిమా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన భారీ ఓపెనింగ్స్ తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 

మొదటి రోజునే హిట్ టాక్ రావడంతో, శనివారం నుంచి థియేటర్స్ పెంచవలసిన వచ్చింది. దాంతో ఈ సినిమా మరింత దూకుడు చూపిస్తూ వెళ్లింది. అలా మొదటి మూడు రోజులలో ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. రెండు రోజులలోనే బ్రేక్ ఈవెన్ ను సాధించింది, రవితేజ కెరియర్లో చాలా వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాగే రవితేజ కెరియర్లో యూ ఎస్ బాక్సాఫీస్ వైపు నుంచి, తొలి మిలియన్ డాలర్ మూవీగా నిలిచింది. ఇక సోమవారం రోజున కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తుండటం విశేషం. 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేసే సమయం చాలా దగ్గరలోనే ఉంది.  

 కూతురు పట్ల ఉన్న ప్రేమ .. ఆ కూతురును ఇచ్చిన అయ్యప్పస్వామి పట్ల భక్తి రవితేజ పాత్రలో ప్రధానమైన కోణాలుగా కనిపిస్తాయి. ఆడపిల్లలకు ఒక ఆశయం ఉండాలి .. వాళ్లు ధైర్యంగా పెరగాలి .. ఆదర్శంగా నిలవాలి అనే కాన్సెప్ట్  తో రూపొందిన ఈ సినిమాకి, పాటలు అదనపు బలంగా నిలిచాయి. విలేజ్ నేపథ్యంలోని హీరోయిజం .. విలేజ్ ను అడ్డాగా చేసుకుని దుర్మార్గాన్ని సాగించాలనుకున్న విలనిజం ఆవిష్కరణ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రవితేజ కెరియర్ లో గొప్ప హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పచ్చు.

Advertisement
Ravi Teja
Irumudi
Shiva Nirvana
Irumudi Box Office Collection
Ravi Teja 100 Crore Club
Irumudi US Box Office

More Telugu News