వైసీపీ అభ్యర్థిగా తూమాటి.. మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ అభ్యర్థిగా తూమాటి.. మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్

Thumati Madhava Rao files nomination for AP Council Deputy Chairman post as YSRCP candidate
  • వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాధవరావు
  • తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న తూమాటి
  • మాధవరావు గెలుపునకు సహకరించాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచన
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ పదవికి పార్టీ సీనియర్ నాయకుడు తూమాటి మాధవరావు మంగళవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, తూమాటి మాధవరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. మాధవరావును అభినందించిన వైఎస్ జగన్.. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆకాంక్షించారు.

మండలిలోని పార్టీ ఎమ్మెల్సీలందరూ సమన్వయంతో వ్యవహరించాలని, తూమాటి మాధవరావు ఎన్నికకు పూర్తిస్థాయిలో సహకరించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో మాధవరావు ఎన్నిక లాంఛనప్రాయం కానుంది.                                
Advertisement
Thumati Madhava Rao
YSRCP
AP Legislative Council Deputy Chairman
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Council Deputy Chairman Nomination

More Telugu News