ముగిసిన సమయం.. శ్రీకాకుళం జైలు వద్ద జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన సమయం.. శ్రీకాకుళం జైలు వద్ద జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దు

YS Jagan Mohan Reddy and Seediri Appalaraju Mulakhat cancelled at Srikakulam Jail
  • శ్రీకాకుళం అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పలరాజు
  • ములాఖత్ లో కలిసేందుకు వెళ్లిన జగన్
  • సాయంత్రం 5 గంటలు దాటడంతో అనుమతి నిరాకరించిన జైలు అధికారులు

రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టయి శ్రీకాకుళం అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ చివరి నిమిషంలో రద్దయింది. ములాఖత్ కోసం జగన్ కు జైలు అధికారులు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే జైలు వద్దకు జగన్ చేరుకునే సమయానికి నిర్ణీత గడువు ముగిసిపోయింది. సమయం దాటిన తర్వాత కూడా అప్పలరాజును కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరగా, జైలర్ ఉన్నతాధికారులతో సంప్రదించారు. జైలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, సాయంత్రం 5 గంటల దాటిన తర్వాత ఎలాంటి ములాఖత్‌కు అనుమతి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

జైలు నిబంధనల దృష్ట్యా అధికారుల నుంచి అనుమతి లభించకపోవడంతో జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దయింది. అనంతరం జైలు ప్రాంగణం వద్దే వేచి ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను జగన్ కలిసి పరామర్శించారు.

Advertisement
YS Jagan Mohan Reddy
Seediri Appalaraju
Srikakulam Ampolu Jail
YSRCP
Andhra Pradesh Politics
Mulakhat Cancelled

More Telugu News