తల్లి కావడానికి ముందు సమంత మరో కీలక ప్రకటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తల్లి కావడానికి ముందు సమంత మరో కీలక ప్రకటన!

Samantha makes another key announcement before becoming a mother
  • తల్లి కాబోతున్న హీరోయిన్ సమంత
  • ఈ తరుణంలో స్టార్‌ హీరోయిన్‌ నుంచి మరో కీలక ప్రకటన
  • సోనీ లివ్‌ తమిళ్‌తో కొత్త ప్రాజెక్ట్‌
  • నిర్మాతగానా? నటిగానా? అనేది క్లారిటీ ఇవ్వని నటి
  • త్వరలో ప్రకటిస్తానని వెల్లడి
స్టార్‌ హీరోయిన్‌ సమంత వ్యక్తిగత జీవితంలో తల్లి కావడానికి సిద్ధమవుతూనే.. కెరీర్‌లో మరో కీలక అడుగు వేసింది. ఇటీవల తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన ఆమె.. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌తో కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించింది.

సోనీ లివ్‌ తమిళ్‌తో కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్‌ను సమంత ప్రకటించింది. అయితే ఇందులో ఆమె నటిస్తారా? నిర్మాతగా వ్యవహరిస్తారా? అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం రెండు బాధ్యతలూ ఆమె చేపట్టే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది మార్పులను స్వీకరించడం, కొత్త ఆరంభాలను ఆహ్వానించడం నేర్పింది. సోనీ లివ్‌ తమిళ్‌తో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాం. త్వరలోనే అందరితో పంచుకుంటాను’’ అని వెల్లడించింది.

ఇక వ్యక్తిగత జీవితంలో సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు తమ తొలి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో ఆమె తాను గర్భవతిని అని అధికారికంగా ప్రకటించింది.

‘‘కొంతకాలం విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్యాప్‌ తర్వాత మళ్లీ వస్తాను’’ అని సమంత తెలిపారు. ఇటీవల సోషల్‌ మీడియాలో బేబీ బంప్‌తో దిగిన ఫొటోను పంచుకున్న ఆమె.. ‘‘నా సిక్స్‌ప్యాక్‌... మళ్లీ కలుద్దాం’’ అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు.
Advertisement
Samantha Ruth Prabhu
Raj Nidimoru
SonyLIV Tamil
Samantha Pregnancy Announcement
Samantha Maternity Leave
Maa Inti Bangaram

More Telugu News