జగన్ చెప్పే 'మావిగన్' పేరు వింటేనే నవ్వు వస్తుంది: విష్ణుకుమార్ రాజు
- వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్న జగన్
- అమరావతిపై బురదజల్లేందుకు కొత్త డ్రామాకు తెరలేపారన్న విష్ణు రాజు
- మావిగన్ అంశమే జగన్‌కు హానికరంగా మారుతుందని హెచ్చరిక
రాజధాని అమరావతిపై మళ్లీ బురదజల్లేందుకే జగన్ ఈ కొత్త డ్రామాకు తెరలేపారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గతంలో మూడు రాజధానుల ముచ్చట చెబితే... రాష్ట్ర ప్రజలు వైసీపీని ఇంటికి పంపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా ‘మావిగన్’ పేరు చెప్పి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న అమరావతిని దెబ్బతీయాలని చూస్తే... రాబోయే రోజుల్లో జగన్‌కు ఈ ‘మావిగన్’ అంశమే రాజకీయంగా తీవ్ర హానికరంగా మారుతుందని హెచ్చరించారు.