భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!

Samantha Ruth Prabhu Gets Proposal in Front of Husband Video Goes Viral
  • 'మా ఇంటి బంగారం' సినిమాతో వస్తున్న సమంత
  • ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని ఘటన
  • స్టేజ్‌పైకి దూసుకొచ్చి సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని
  • అభిమానితో ఓపికగా సెల్ఫీ దిగి తిరిగి పంపించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని హఠాత్తుగా వేదికపైకి వచ్చి భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిన్న‌ జరిగిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరైంది. వేదికపై సమంత భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు మాట్లాడుతుండగా.. ఓ అభిమాని అకస్మాత్తుగా స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. నేరుగా సమంత వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని, చేతిలోని పువ్వులతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ అనూహ్య పరిణామానికి రాజ్ నిడిమోరు, యాంకర్ శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి షాక్‌కు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ అభిమానిని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ అభిమాని ఒక్క సెల్ఫీ కావాలని కోరడంతో సమంత ఎంతో ఓపికగా స్పందించారు. అతడిని నిరాశపరచకుండా చిరునవ్వుతో సెల్ఫీకి ఫోజులిచ్చారు. అభిమాని పట్ల సమంత చూపిన తీరుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
Advertisement
Samantha Ruth Prabhu
Ma Inti Bangaram
Samantha movie
Raj Nidimoru
Nandini Reddy
Srimukhi
Samantha fan proposal
Telugu movie trailer launch
Viral video
Samantha selfie

More Telugu News