సీఎం విజయ్‌పై పోస్టులు.. యాపిల్ సంస్థ ఉద్యోగి అరెస్టు
- పదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి పోస్టులు
- ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
- హత్యాచార ఘటనకు సంబంధించి సీఎంపై జేమ్స్ అనే వ్యక్తి పోస్టులు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. అరెస్టు చేసిన పోలీసులు
మైనర్ బాలిక హత్యాచార ఘటన దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులను కార్తీ, మోహన్ రాజ్‌గా గుర్తించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ క్రమంలో తిరునల్వేలి జిల్లాకు చెందిన జేమ్స్ రాజా అనే వ్యక్తి సీఎంకు పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్టు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతను బెంగళూరులోని యాపిల్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా జేమ్స్ గత రెండు నెలలుగా హెల్త్ ఇష్యూపై సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది.