కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య

Former MLA Mallaiah Yadav meets KTR
  • హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో కేటీఆర్ ను కలిసిన కోదాడ మాజీ ఎమ్మెల్యే
  • పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించిన నేతలు
  • కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలన్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నందినగర్ లో ఉన్న నివాసంలో కేటీఆర్‌ను కలిశారు. కోదాడ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, త్వరలో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని మల్లయ్య యాదవ్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 


ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని సూచించారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ పటిష్ఠ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యేకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

Go Back to Shorts
KTR
KT Rama Rao
Bollam Mallaiah Yadav
Kodad
BRS Party
Telangana Politics
Congress Government
Membership Drive
Telangana
Nandinagar

More Telugu News