జగన్ ఫొటో వల్లే విజయ్ గెలిచాడా..? జగన్ ఏమంటున్నారో చూడండి!

Vijays Victory Jagan Responds to Photo Use in Election
  • తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన వైఎస్ జగన్
  • అది ఆయన కష్టార్జితం అంటూ ప్రశంసలు
  • ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఉంటుందని కానీ, నాకెలా ఉంటుందంటూ వ్యాఖ్య
  • తొలి ఎన్నికలోనే టీవీకే అతిపెద్ద పార్టీగా నిలవడంపై అభినందనలు
  • విజయ్ తన మిత్రుడు, సోదరుడని పేర్కొన్న జగన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధించిన ఘన విజయంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. విజయ్ గెలుపు పూర్తిగా ఆయన కష్టార్జితమని ప్రశంసించారు.

తమిళనాడులో విజయ్ ప్రచారానికి జగన్ ఫొటో వాడటం కలిసి వచ్చిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ బదులిచ్చారర. "ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఉంటుంది కానీ, నాకెలా ఉంటుందయ్యా" అని వినమ్రంగా సమాధానమిచ్చారు. విజయ్ సాధించిన ఘనతలో తన ప్రమేయం ఏమీ లేదని, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత చరిష్మా, శ్రమ ఫలితమేనని పరోక్షంగా స్పష్టం చేశారు.

అంతకుముందు, విజయ్‌కు జగన్ సామాజిక మాధ్యమాల వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నా మిత్రుడు, సోదరుడు తొలి ప్రయత్నంలోనే టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలపడం అద్భుతమైన విజయం అని కొనియాడారు. విజయ్ రాజకీయ ప్రస్థానం విజయవంతం కావాలని, దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుని, అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం పీఠం అధిష్ఠించారు. 
Go Back to Shorts
Vijay Thalapathy
Tamil Nadu Elections
Jagan Mohan Reddy
TVK Party
Tamilaga Vettri Kazhagam
Tamil Nadu Politics
Vijay Political Entry
YS Jagan
Tamil Cinema
Election Results

More Telugu News