ఇరాన్ యుద్ధం.. ట్రంప్, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం?
- ఇరాన్ వ్యూహంపై ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు
- ఇరాన్‌పై దాడుల ఆలస్యం పొరపాటన్న నెతన్యాహు
- దౌత్య చర్చల కోసం ట్రంప్ తాత్కాలిక బ్రేక్
- శాంతి ఒప్పందం కోసం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
- చర్చలు విఫలమైతే దాడులకు సిద్ధమన్న ట్రంప్
ఇరాన్ యుద్ధాన్ని ముగించే వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య దాదాపు గంటపాటు ఫోన్లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇరాన్‌పై వెంటనే వైమానిక దాడులు ప్రారంభించాలని నెతన్యాహు ఒత్తిడి చేయగా, దౌత్య చర్చలకు మరో అవకాశం ఇవ్వాలని ట్రంప్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
రగిలిపోయిన నెతన్యాహు
మీడియా కథనాల ప్రకారం.. ఈ ఫోన్ కాల్ తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌తో శాంతి చర్చలపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాడులను ఆలస్యం చేయడం పెద్ద పొరపాటని, ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ప్లాన్ ప్రకారం యుద్ధాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన ట్రంప్‌తో వాదించినట్లు తెలుస్తోంది.
చర్చలకే ట్రంప్ మొగ్గు
యుద్ధానికి స్వస్తి పలికేలా అమెరికా-ఇరాన్ మధ్య సంతకాలకు ఖతార్, పాకిస్థాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ట్రంప్ వివరించినట్లు తెలుస్తోంది. అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి తెరిచే అంశాలపై 30 రోజుల పాటు చర్చలు జరపాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ అవి విఫలమైతే మళ్లీ యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
పైకి మాత్రం ‘ఆల్ ఈజ్ వెల్’
నెతన్యాహుతో తీవ్రమైన విభేదాలు వచ్చినా ట్రంప్ మాత్రం బయటకు ఏమీ తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. ఇరాన్ విషయంలో తాను ఏం చెబితే నెతన్యాహు అదే వింటారని ట్రంప్ మీడియాకు తెలిపారు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి అరబ్ దేశాల అభ్యర్థన మేరకే ఇరాన్‌పై దాడుల ప్రణాళికను తాత్కాలికంగా ఆపినట్లు ట్రంప్ గతంలోనే ప్రకటించారు.