పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి!
- లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం
- ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ మెరుపు అర్ధశతకాలు
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు
- రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం
- లక్నో బౌలర్లను చితకబాదిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. యువ ఆటగాళ్లు ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ ఆడిన తీరుకు లక్నో బౌలర్లకు చుక్కలు కనిపించాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో నిర్ణయం ఎంత పెద్ద తప్పో తమ బ్యాట్లతో సమాధానమిచ్చారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పంజాబ్ కింగ్స్ ఏకంగా 254 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానలీ అసలు సిసలు విధ్వంసం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 పరుగులు చేసి శతకం చేజార్చుకున్నాడు. మరోవైపు కూపర్ కనోలీ కూడా తనదైన శైలిలో చెలరేగాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 87 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 బంతుల్లోనే 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్ భారీ స్కోరుకు పటిష్ఠమైన పునాది వేశారు.
ఈ ఇద్దరు ఔటయ్యాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) విఫలమైనా.. చివర్లో మార్కస్ స్టొయినిస్ (16 బంతుల్లో 29), నేహాల్ వధేరా (7 బంతుల్లో 13), శశాంక్ సింగ్ (6 బంతుల్లో 17) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో పంజాబ్ స్కోరు 250 పరుగుల మార్కును దాటింది.
లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. షమీ 4 ఓవర్లలో 56 పరుగులు ఇవ్వగా, అవేష్ ఖాన్ 3 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు, మణిమారన్ సిద్ధార్థ్ 2 వికెట్లు తీసి కాస్త ఫర్వాలేదనిపించారు. మొత్తంగా పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. లక్నో ముందు 255 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది.