అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) కె. శాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈ నెల 6న శాంతిపై కేసు నమోదు చేశారు. 7న ఆమెకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.1.37 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అదే రోజు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కె. శాంతిని సస్పెండ్ చేశారు. ఆమె అరెస్టయిన ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.